Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు ఇందిరాభవన్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ది గ్రేట్ సింహపురి షాపింగ్ ఫెస్టివల్ లో ఆదిలక్ష్మి కంప్యూటర్ నీడ్స్ కు చెందిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎలక్ట్రానిక్ వస్తువులకు సంభందించి ఏఏ వస్తువుపై ఎంత మేర GST సుంకం తగ్గిందో ఈ స్టాల్ లో ప్రజలకు సవివరంగా తెలియజేశారు. సూపర్ GST… సూపర్ సేవింగ్స్ పేరుతో… రాష్ట్ర ప్రభుత్వం సౌజన్యంతో ఈ ఎగ్జిబిషన్ సాగుతోంది. ఈ ఎగ్జిబిషన్ లో నెల్లూరు ఆర్.ఆర్. స్ట్రీట్ లోని శేషసాయి టవర్స్ లో ఉన్న ఆదిలక్ష్మి కంప్యూటర్ నీడ్స్ సంస్థ నిర్వాహకురాలు శ్రీమతి దుగ్గిశెట్టి జోత్స్న ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజలు అధిక సంఖ్య ఆదిలక్ష్మి కంప్యూటర్స్ స్టాల్ ను సందర్శించి కంప్యూటర్స్, ల్యాప్ టాప్స్, కంప్యూటర్ అనుబంధ యాక్ససరీస్, ప్రింటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై తగ్గిన GST వివరాలు తెలుసుకుంటున్నారు. శ్రీమతి జోత్స్న ప్రజలకు తగ్గిన GSTపై అవగాహన కల్పించారు. అనేక మంది ఆదిలక్ష్మి కంప్యూటర్ నీడ్స్ లో ఆర్డర్లు బుక్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలక్ష్మి కంప్యూటర్స్ నుండి సుధాకర్, శ్రీనివాసులు, వినయ్, మల్లిఖార్జున, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
