Clock Of Nellore ( Nellore ) – జగన్ పరిపాలనలో అస్థవ్యస్థమైన రాష్ట్రం తిరిగి పురోగమనం చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టిడిపి నెల్లూరు జిల్లా అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ వెల్లడించారు. రొట్టెల పండుగ జరుగుతున్న నెల్లూరులోని బారా షహీద్ దర్గాను వారు సందర్శించి చంద్రబాబు సిఎం కావాలని కోర్కెల రొట్టెను అందించారు. ముందుగా దర్గాలోని బారాషహీదుల సమాధులను దర్శించుకుని ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం స్వర్ణాల చెరువులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి… చంద్రబాబు సిఎం కావాలనే రొట్టెను అజీజ్ కు అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో రాష్ట్రం అధోగతి పాలవుతుందని అన్నారు. రాష్ట్రం పూర్వం మాదిరిగా సుభిక్షింగా ఉండాలంటే చంద్రబాబు సిఎం కావాలని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం నేతృత్వంలోనే బారా షహీద్ దర్గాను ఎంతో అభివృద్ది చేశామని వెల్లడించారు.
