‘అన్నా’ రొట్టెల పండుగకి రండి : అన్నీ పార్టీ నేతలకు ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్

Clock Of Nellore ( Nellore ) – ప్రతిష్టాత్మకంగా ఈనెల 9 నుంచి నిర్వహిస్తున్న బారా షాహిద్ రొట్టెల పండగ సంబంధించి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సరి కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. రాజకీయాలకు అతీతంగా వైసీపీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేన నేతలకు రూరల్ ఎమ్మెల్యే స్వయంగా ఫోన్ చేసి కుటుంబ సమేతంగా రొట్టెల పండుగకు రావాలని ఆహ్వానించారు. ఒక గంట ముందు తనకు ఫోన్ చేస్తే స్వయంగా తానే బారా షాహీద్ దర్గా వద్దకు వచ్చి స్వాగతం పలుకుతానని దర్శనానికి తీసుకువెళ్తానని చెప్పారు. తప్పకుండా బారాషాహీద్ రొట్టెల పండుగకు రావాలని పండగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తనకు అత్యంత సన్నిహితంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల దగ్గర్నుంచి తనను విమర్శించే వారిని సైతం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించడం గమనార్హం. రొట్టెల పండుగకు సంబంధించి రాజకీయాలకతీతంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆహ్వానం పలికారు.

Read Previous

ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ1 ప్రయోగం విఫలం.. నిరుపయోగంగా శాటిలైట్స్‌

Read Next

నెల్లూరుజిల్లాలో విషాదం : భార్యా బిడ్డను చంపి ఆపై తానూ ఆత్మహత్య

Leave a Reply

Your email address will not be published.