Clock Of Nellore ( Nellore ) – మత సామరస్యానికి ప్రతీకగా నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో ప్రతీ ఏడాది జరిగే రొట్టెల పండుగను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహిస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ( MLA Kotamreddy Sridharreddy ) వెల్లడించారు. ఈనెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకూ జరిగే రొట్టెల పండుగ ఏర్పాట్లపై… వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు ( Barashaheed Darga Roti Festival – 2022 ). దర్గా ప్రాంగణంలో జరిగిన ఈ సమీక్షకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్, రెవెన్యూ ఇతర అధికారులు హాజరయ్యారు. కరోనా కారణంగా రెండేళ్లుగా రొట్టెల పండుగ కేవలం దర్గాకే పరిమితమైందని, భక్తులను అనుమతించలేదని కోటంరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కరోనా తగ్గుముఖం పట్టిన నేపద్యంలో ఈ ఏడాది పండుగను ఘనంగా జరుపుకోవాలని సూచించారు. దానికి సంభందించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అన్నీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. దర్గా ప్రాంగణంలో అత్యంత సుందరంగా ఈద్గా నిర్మించడంపై ముస్లిం మత పెద్దలు ఎమ్మెల్యే కోటంరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ యాకసిరి వాసంతి, దర్గా కమిటి సభ్యులు, మత పెద్దలు పాల్గొన్నారు.
