రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదు : స్పష్టం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదని, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నమ్మొద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. సోమవారం నెల్లూరులో పర్యటించిన ఆయన వంట గ్యాస్ కొరత వదంతులపై మాట్లాడారు. ఈనెల 26వ తేదీన విశాఖపట్నంకు ఎల్పీజి నౌక వచ్చిందని, దాంతో ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి సమస్య ఉండదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా వాణిజ్య అవసరాల నిమిత్తం 20 శాతం గ్యాస్ సరఫరా పెంచింది. వారి కష్టాలు కూడా తొలగుతాయి. అంతర్జాతీయ పరిణామాలు నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు భవిష్యత్తులో ఉన్నా, దానికి అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో పెట్రోల్ కొరత ఎక్కడా లేదు. భవిష్యత్తు ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వైపు దృష్టి సారించింది. దానిలో భాగంగానే రాష్ట్రంలోని ఏడు ప్రధాన నగరాల్లో పి. ఎన్. జి. గ్యాస్ కనెక్షన్లు పెంచుతున్నాం. దీనివల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పెరిగి, ఒత్తిడి తగ్గుతుంది. నిరంతరం రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం.” అని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Read Previous

నెల్లూరుజిల్లాలో మంత్రి నాదెండ్ల సుడిగాలి పర్యటన : అధికారులు, మిల్లర్లతో సమీక్షలు

Read Next

నెల్లూరు కార్పొరేషన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మేయర్ సుజాత : సభ్యుల ఆమోదం

Leave a Reply

Your email address will not be published.