రేపటి నుండి ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) – కాలి నొప్పితో బాధపడుతూ గత కొన్ని రోజులుగా హాస్పిటల్ లో ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం నుండి తన కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. కాలి నొప్పి నుండి పూర్తిగా కోలుకున్న శ్రీధర్ రెడ్డి ఇవాళ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. కాలికి సంబంధించి న్యూరో సమస్యతో బాధపడుతున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత నెలలో సుమారు 25 రోజుల పాటూ కేరళలో ప్రకృతి వైద్యం చేయించుకున్నారు. అప్పుడు స్వల్పంగా కాలి నొప్పి తగ్గినప్పటికీ మళ్లీ కాలి నొప్పి తిరిగబెట్టింది. దీంతో ఆయన గత వారం రోజులుగా చెన్నై రాయవేలూరులోని సిఎంసి హాస్పిటల్ లో ఉంటూ చికిత్స తీసుకున్నారు. కాలి నొప్పి పూర్తిగా నయం కావడంతో సోమవారం వైద్యులు ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబ సమేతంగా అటు నుండి అటే కాణిపాకం వినాయక దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం నెల్లూరులోని ఇంటికి చేరుకుంటారు. మంగళవారం నుండి తన కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.

Read Previous

ప్రతీ ధాన్యపు గింజా కొనుగోలు చేస్తాం : నెల్లూరులో స్పష్టం చేసిన మంత్రి నాదెండ్ల

Read Next

ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేరుస్తా : నాయుడుపేటలో సిఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published.