నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అరుదైన గుండె శస్త్ర చికిత్స విజయవంతం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో అతి క్లిష్టమైన, అరుదైన గుండె శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. నెల్లూరు బాలాజీనగర్ కు చెందిన 74 ఏళ్ల సరోజనమ్మ అనే మహిళకు ఓపెన్ హార్ట్ పద్దతిలో కాకుండా లాప్రోస్కోపీ పద్దతిలో గుండె రక్తనాళాలను విజయవంతంగా మార్పిడి చేశారు. దీనిపై గురువారం నెల్లూరు అపోలో హాస్పిటల్ లో ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిర్రా భక్తవత్సల రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బింధు భార్గవి రెడ్డి, క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ ఎమ్. శ్రీనివాస్, కార్డియాలజిస్టులు డాక్టర్ షర్మిలి, డాక్టర్ నాగభూషణం కార్డియాక్ అనస్థీషియన్ డాక్టర్ మధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చిర్రా భక్తవత్సల రెడ్డి మాట్లాడుతూ 74 ఏళ్ల సరోజనమ్మకు గుండె వాల్స్వ్ మరియు రక్తనాళాలు పూడుకుపోయాయని, సాధారణంగా అయితే ఆమెకు వాల్వ్ రీప్లేస్మెంట్, బైపాస్ సర్జరీ చేయాల్సి ఉందన్నారు. డబుల్ వెసెల్ డిసీజ్ (Double Vessel Disease) అంటే ఆమె 94 కేజీల బరువు కారణంగా ఆమెకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం ప్రాణానికే ప్రమాదమని వెల్లడించారు. ఈ నేపద్యంలో వారి కుటుంబసభ్యుల అంగీకారంతో TAVR మరియు RCA పద్దతి ద్వారా లాప్రోస్కోపీ విధానంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో, ఆమె గుండెకు కాలి ద్వారా అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించామన్నారు. ఈ శస్త్రచికిత్సకు ముందు పేషెంట్ యొక్క గుండె పంపింగ్ 25% నుండి 30% గా ఉండగా ఇప్పుడది 65% పెరిగి నార్మలుగా ఉందన్నారు.ఈ విధానం ద్వారా ఎలాంటి కోతలు, అధిక రక్త స్రావం లేకుండా విజయవంతంగా గుండె రక్తనాళాలను మార్చామని డాక్టర్ భక్తవత్సల రెడ్డి పేర్కొన్నారు. అనంతరం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ మాట్లాడుతూ క్లిష్టమైన సర్జరీలను సైతం నెల్లూరు అపోలో హాస్పిటల్ లో ఉన్న ఆధునిక వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందాల చేత విజయవంతంగా నిర్వహిస్తున్నామని, నెల్లూరు అపోలో హాస్పిటల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Read Previous

నెల్లూరుజిల్లాలో పట్టాలు తప్పిన గూడ్సు రైలు : రైళ్ల రాకపోకలకు అంతరాయం

Read Next

అప్రమత్తంగా ఉంటే క్యాన్సర్ ను జయించవచ్చు : మెడికవర్ వైద్యులు శ్రావణ్ కుమార్ రెడ్డి వెల్లడి

Leave a Reply

Your email address will not be published.