నెల్లూరు మెడికవర్ లో అత్యాధునిక బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ చికిత్సలు

Clock Of Nellore ( Nellore ) – రక్త సంబంధిత క్యాన్సర్లు మరియు తీవ్రమైన రక్త వ్యాధులతో బాధపడుతున్న రోగులకు నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్‌లో అత్యాధునిక బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ (Bone Marrow Transplant – BMT) చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కీలక సేవలను కన్సల్టెంట్ మెడికల్ & హీమటో ఆంకాలజిస్ట్ మరియు బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ డా. మౌనిక రెడ్డి యల్లాల విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ల్యూకేమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా, అప్లాస్టిక్ అనీమియా వంటి క్లిష్టమైన రక్త సంబంధిత వ్యాధులకు బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ ప్రాణరక్షక చికిత్సగా నిలుస్తోంది. రోగి పరిస్థితిని బట్టి ఆటోలాగస్ మరియు అల్లోజెనిక్ ట్రాన్స్‌ప్లాంట్ విధానాలను నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్‌లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నారు.

ఈ కేంద్రంలో అధునాతన ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్, ఇన్‌ఫెక్షన్-కంట్రోల్ ఐసోలేషన్ వార్డులు, ప్రత్యేక శిక్షణ పొందిన నర్సింగ్ బృందం, ఆధునిక ల్యాబ్ సపోర్ట్ వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ట్రాన్స్‌ప్లాంట్‌కు ముందు నుంచి తర్వాత వరకు రోగికి సమగ్ర సంరక్షణ అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ సందర్భంగా డా. మౌనిక రెడ్డి యల్లాల మాట్లాడుతూ, “బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ ద్వారా రక్త క్యాన్సర్లు మరియు ఇతర తీవ్రమైన రక్త వ్యాధులతో బాధపడుతున్న అనేక మందికి కొత్త జీవితం అందించగలుగుతున్నాం. నెల్లూరులోనే ఈ స్థాయి చికిత్స అందుబాటులో ఉండడం రోగులకు ఎంతో ఉపయోగకరం” అని తెలిపారు. ప్రాంత ప్రజలకు ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్సలను అందించాలనే లక్ష్యంతో నెల్లూరు మెడికవర్ హాస్పిటల్స్ ముందుకు సాగుతోందని ఆసుపత్రి ప్రతినిధులు తెలిపారు.

Dr. మౌనిక రెడ్డి యల్లాల
MBBS ( GoldMedalist ) DNB ( General Medicine ) Gold Medalist
Consultant Medical & Hemato Oncologist
Bone Marrow Transplant physician

Read Previous

లోకేష్ తోనే రాష్ట్ర భవిష్యత్తు : యువనేత పుట్టిన రోజు వేడుకల్లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

Read Next

ఆంధ్రప్రదేశ్ ఆశాకిరణం నారా లోకేష్ : ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

Leave a Reply

Your email address will not be published.