Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో కేవలం 5 నిముషాల్లోనే క్యాన్సర్ ను నిర్ధారించే అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని హాస్పిటల్ న్యూక్లియర్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ జీపాళెం సాయి మౌళిక తెలిపారు. దక్షిణ ఆంద్రప్రదేశ్ ప్రాంతాల్లో ఎక్కడా లేని PET – CT స్కాన్ ఒక్క మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లోనే అందుబాటులో ఉందన్నారు. క్యాన్సర్ నిర్ధారణ, తర్వాత చికిత్సల్లో PET-CT స్కాన్ ఒక విప్లవాత్మక సాధనమని ఆమె కొనియాడారు. క్యాన్సర్ నిర్ధారణలో PET-CT పనితీరు ఏంటి చికిత్సలో దాని ఉపయోగాలు ఏంటి అనే దానిపై డాక్టర్ జీపాళెం సాయి మౌళిక ప్రజలకు అవగాహన కల్పించారు. పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (PET) మరియు కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) స్కాన్‌ల కలయికే PET-CT స్కాన్ అని తెలిపారు. శరీరంలోని అవయవాలు, కణజాలాల క్రియాత్మక (PET), నిర్మాణాత్మక (CT) సమాచారాన్ని ఇమేజింగ్ పద్దతి ద్వారా సమాచారాన్ని ఒకే సారి PET-CT స్కాన్ అందిస్తుందని పేర్కొన్నారు. ఇది ముఖ్యంగా క్యాన్సర్ నిర్ధారణ, క్యాన్సర్ ఏ దశలో ఉందో గుర్తించడం, చికిత్స పురోగతిని పర్యవేక్షించడంలో PET-CT స్కాన్ అద్భుతమైన ఫలితాలను అందిస్తుందని వెల్లడించారు. PET-CT స్కాన్ పరికరం ఒక్క నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో తప్పా దక్షిణ ఆంధ్రాలో ఎక్కడా లేదని స్పష్టం చేశారు.
PET-CT ఎలా పనిచేస్తుంది… ?
PET – CT స్కాన్ చేయడానికి ముందు, రోగికి తక్కువ మొత్తంలో రేడియోధార్మిక ట్రేసర్ ( సాధారణ ఫ్లోరోడియోక్సీ గ్లూకోజ్ లేదా FDG ) సిరలోకి ఇంజెక్ట్ చేయబడుతుంది. క్యాన్సర్ కణాలు ఆరోగ్యకరమైన కణాల కంటే ఎక్కువ గ్లూకోజ్‌ను వినియోగిస్తాయి కాబట్టి, రేడియోధార్మిక గ్లూకోజ్… క్యాన్సర్ కణాల వద్ద ఎక్కువగా పేరుకుపోతుంది. PET స్కాన్ ఈ ట్రేసర్ విడుదల చేసే గామా కిరణాలను గుర్తించి, శరీరంలో జీవక్రియ కార్యకలాపాలు అధికంగా ఉన్న ప్రాంతాలను 3D చిత్రాలుగా చూపుతుంది. అదే సమయంలో CT స్కాన్ అవయవాలు, ఎముకలు మరియు ఇతర కణజాలాల వివరణాత్మక నిర్మాణ చిత్రాలను సృష్టిస్తుంది. ఈ రెండు చిత్రాలను కలిపి, క్యాన్సర్ కణతులు ఎక్కడ ఉన్నాయి, వాటి పరిమాణం మరియు శరీరంలో ఎంతవరకు విస్తరించాయో ఖచ్చితంగా తెలుసుకోవచ్చునని డాక్టర్ జీపాళెం సాయి మౌళిక వెల్లడించారు.
PET – CT స్కాన్ వల్ల ఉపయోగాలు ఏంటి … ?
శరీరంలోని క్యాన్సర్ కణతులను గుర్తించి అవి శరీరంలోని ఇతర భాగాలకు ఎంత వరకూ వ్యాపించాయో అంచనా వేసి సరైన చికిత్సా ప్రణాళికను రూపొందిస్తుందని చెప్పారు. అలాగే PET – CT స్కాన్ ద్వారా క్యాన్సర్ చికిత్స ( కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ) ఎంత వరకూ పనిచేస్తుంది, శరీరంలో క్యాన్సర్ కణతులు తగ్గుతున్నాయా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చునని చెప్పారు. చికిత్స తర్వాత క్యాన్సర్ మళ్లీ వచ్చిందా లేదా అనేది కూడా PET – CT స్కాన్ ద్వారా నిర్ధారించవచ్చునని పేర్కొన్నారు. క్యాన్సర్ కణతులు ఎక్కడ ఉన్నాయనేది ఖచ్చితంగా PET – CT స్కాన్ నిర్ధారించవచ్చునని, తద్వారా ఆరోగ్యకరమైన కణజాలాలకు నష్టం జరగకుండా కేవలం క్యాన్సర్ సోకిన కణజాలాలకే రేడియేషన్ థెరపీని చేసేందుకు ఈ స్కాన్ ఉపయోగపడుతుందని డాక్టర్ జీపాళెం సాయి మౌళిక వివరించారు.
PET-CT స్కాన్ చేయించుకోవాలనుకునే వారు స్కాన్ కు 6 గంటల ముందు నుండి మంచినీరు తప్పా ఆహారంగా ఇంకేమీ తీసుకోకూడదని డాక్టర్ సాయి మౌళిక తెలియజేశారు. మధుమేహం ఉన్న వారు వైద్యుల సూచనలు పాటించాలని, స్కాన్ కు 24 గంటల ముందు ఎలాంటి వ్యాయామాలు చేయకూడదన్నారు. స్కాన్ కు ముందు న్యూక్లియర్ మెడిసిన్ వైద్యులు రోగికి రేడియోథార్మిక ట్రేసర్ ను ఇంజెక్ట్ చేస్తారని, తర్వాత అది శరీరంలోకి పూర్తిగా వ్యాపించడానికి రోగి సుమారు 30 నుండి 60 నిముషాలు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. విశ్రాంతి తర్వాత రోగి స్కానింగ్ టేబుల్ పై పడుకుంటే స్కానింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. PET-CT స్కాన్ క్యాన్సర్ చికిత్సలో శక్తివంతమైన సాధనమని, ఇది వైద్యులకు మరింత ఖచ్చితమైన సమాచారాన్ని అందించి, రోగులకు మెరుగైన ఫలితాలను ఇచ్చేందుకు సహాయపడుతుందన్నారు. నెల్లూరులోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో అన్నీ రకాల క్యాన్సర్లకు అధునాతనమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, మెడికవర్ లో క్యాన్సర్ కు చికిత్స తీసుకున్న వందల మంది నేడు సంపూర్ణమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారని, మెడికవర్ సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ జీపాళెం సాయి మౌళిక పిలుపునిచ్చారు.