మెడికవర్ హాస్పిటల్ లో ప్రపంచ యోగా దినోత్సవం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ కు చెందిన వివిధ విభాగాల అధిపతులు, నర్సింగ్ సిబ్బంది, హౌస్ కీపింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొని యోగా విశిష్ఠతను తెలుసుకోవడమే కాకుండా వివిధ యోగాసనాలు వేశారు. యోగా మాస్టర్ ప్రసన్న కుమార్, సహాయకురాలు అరుణ హాస్పిటల్ సిబ్బందితో యోగాసనాలు వేయించారు. యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఒక్కో ఆసనం స్వయంగా చేసి చూపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ప్రధమ పాత్ర పోషిస్తుందని చెప్పారు. రోజూ వారీ జీవితంలో యోగాను ఒక భాగంగా అలవర్చుకోవాలని, దాని వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు. కార్యక్రమం అనంతరం యోగా గురువులను సిబ్బంది సత్కరించారు.

Read Previous

మెడికవర్ లో అత్యాధునిక పద్దతుల్లో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు

Read Next

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో క్యాన్సర్ కు అత్యాధునిక వైద్య సేవలు

Leave a Reply

Your email address will not be published.