మెడికవర్ లో అత్యాధునిక విధానంతో బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్సలు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ మరియు మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో అత్యాధునిక విధానాలతో బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ (ఎముక మజ్జ మార్పిడి) చికిత్సలు అందిస్తున్నట్లు హాస్పిటల్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ జి. రంగ రామన్ తెలిపారు. బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స ఎవరికి అవసరం, దాని ప్రాముఖ్యత, విధానాలను ఆయన అవగాహన కోసం ప్రజలకు వివరించారు. బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ (ఎముక మజ్జ మార్పిడి) దీన్నే స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్ అని కూడా అంటారన్నారు. ల్యుకేమియా, లింఫోమా, మైలోమా, ఎప్లాస్టిక్ ఎనీమియా అనే రకాలుగా పిలవబడే బ్లడ్ క్యాన్సర్ రోగులకు బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్సలు చేయాల్సి వస్తుందని తెలియజేశారు. చికిత్సలో భాగంగా బ్లడ్ క్యాన్సర్ కారణంగా దెబ్బదిన్న ఎముక మజ్జను ఆరోగ్యకరమైన స్టెమ్ కణాలతో భర్తీ చేయాల్సి ఉంటుందని, భర్తీ అయిన స్టెమ్ కణాలు కొత్త కణాలను ఉత్పత్తి చేసి దెబ్బతిన్న ఎముక మజ్జ పూర్తి ఆరోగ్యకరంగా మారుతుందని పేర్కొన్నారు.

ల్యుకేమియా (Leukemia) రకంలోని బ్లడ్ క్యాన్సర్లలో ఆక్యూట్ మరియు క్రానిక్ ల్యుకేమియా క్యాన్సర్లలో కీమోథెరపీ, రేడియేషన్ థెరపీలు ఎముక మజ్జను దెబ్బతీస్తాయని వారికి బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స అందిస్తే వారికి మజ్జ ఆరోగ్యకరంగా మారుతుందని డాక్టర్ రంగ రామన్ వెల్లడించారు. లింఫోమా (Lymphoma) రకంలోని బ్లడ్ క్యాన్సర్లలో కూడా హాడ్జికిన్స్ మరియు నాన్ – హాడ్జికిన్స్ లింఫోమా క్యాన్సర్లలో కూడా కీమోథెరపీ అధిక మోతాదుతో ఇవ్వడం కారణంగా మజ్జ దెబ్బతింటుందని వారికి కూడా ట్రాన్స్ ప్లాంటేషన్ అవసరం అవుతుందన్నారు. మైలోమా (Myeloma) వంటి రకాల్లోని మల్టిపుల్ మైలోమా క్యాన్సర్ కు ట్రాన్స్ ప్లాంట్ రోగి యొక్క సొంత స్టెమ్ కణాలను ఉపయోగించి ఆటోలోగస్ ట్రాన్స్‌ప్లాంట్ లేదా దాత నుండి సేకరించిన స్టెమ్ కణాలను ఉపయోగించి అల్లోజెనిక్ ట్రాన్స్ ప్లాంట్ చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. ఎప్లాస్టిక్ ఎనీమియా (Aplastic Anemia) అనే రకం సమస్య ఉన్న వారికి ఎముక మజ్జ తగినంత రక్త కణాలను ఉత్పత్తి చేయలేదని అలాంటి వారికి బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ చికిత్స చేస్తే ఆరోగ్యకరమైన స్టెమ్ కణాలు ఉత్పత్తి అవుతాయన్నారు. సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా వారికే కాకుండా జన్యుపరంగా సోకే రక్త రుగ్మతలకు కూడా ట్రాన్స్ ప్లాంట్ ఉపయోగపడుతుందని డాక్టర్ రంగ రామన్ తెలియజేశారు. బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ చికిత్సలు రెండు రకాలుగా చేస్తారని, ఆటోలోగస్ ట్రాన్స్ ప్లాంట్ (Autologous Transplant) ఒకటి, అల్లోజెనిక్ ట్రాన్స్ ప్లాంట్ (Allogeneic Transplant) మరొకటని వివరించారు. ఆటోలోగస్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సలో రోగి యొక్క స్టెమ్ కణాలను సేకరించి నిల్వచేసి, కీమోథెరపి లేదా రేడియేషన్ థెరపీ తర్వాత నిల్వ చేసిన కణాలను రోగికి తిరిగి ఎక్కిస్తారని అన్నారు. రోగి యొక్క సొంత కణాలను ఉపయోగించడం ద్వారా శరీరం కణాలను స్వీకరిస్తుందన్నారు. అదే అల్లో జెనిక్ ట్రాన్స్ ప్లాంట్ విధానంలో దాత నుండి సేకరించిన స్టెమ్ కణాలతో ఎముక మజ్జను భర్తీ చేస్తామని, ఈ క్రమంలో కణాలను శరీరం చాలా ఆలస్యంగా స్వీకరిస్తుందని పేర్కొన్నారు.

బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ చికిత్సలో భాగంగా సేకరించిన స్టెమ్ కణాలను రోగి యొక్క రక్త ప్రవాహంలోకి ఎక్కిస్తామని, తర్వాత ఆ కణాలు ఎముక మజ్జకు చేరుకుని కొత్త కణాలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయన్నారు. చికిత్స తర్వాత రోగి ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తారని, క్రమంగా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ వేగం పుంజుకుంటుందని డాక్టర్ రంగరామన్ వెల్లడించారు. నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ మరియు మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స కోసం ప్రత్యే యూనిట్ అందుబాటులో ఉందని, యూనిట్ అత్యాధునిక సాంకేతికతతో పాటూ అనుభవజ్ఞులైన హెమటో – ఆంకాలజిస్టులు, ట్రాన్స్ ప్లాంట్ నిపుణులు, సహాయ సిబ్బందిని కలిగి ఉందని గుర్తు చేశారు. మెడికవర్ లో ఇప్పటికే అనేక మందికి ఆటోలోగస్, అల్లో జెనిక్ ట్రాన్స్ ప్లాంట్ చికిత్సలను విజయవంతంగా చేశామని, వారంతా ఇప్పుడు నూతన జీవితాన్ని ఆరోగ్యంగా గడుపుతున్నారని డాక్టర్ రంగరామన్ వెల్లడించారు. కేవలం మెట్రో సిటీలకే పరిమితమైన బోన్ మారో ట్రాన్స్ ప్రాంటేషన్ చికిత్సలు మెడికవర్ హాస్పిటల్ లో అందుబాటులో ఉన్నాయని, రోగులు మెడికవర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Read Previous

గుండె జబ్బులకు మెడికవర్ లో ఆధునిక వైద్యం : అవగాహన కల్పించిన వైద్య బృందం

Read Next

ముందుగా గుర్తిస్తే బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి నుండి బయటపడవచ్చు : మెడికవర్ వైద్యులు

Leave a Reply

Your email address will not be published.