రొట్టెల పండుగ నాటికి ముఖ ద్వారాల పనులు పూర్తి : ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులో ప్రసిద్ధిగాంచిన బారా షహీద్ దర్గా ముఖ ద్వారాల పనులు జూలై నెలలో జరిగే రొట్టెల పండుగ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. అధికారులు, ముస్లిం మత పెద్దలతో కలిసి మంగళవారం ముఖ ద్వారాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనులు నాణ్యతగా చేపట్టాలని సూచించారు. జూలై నెల కల్లా పనులు పూర్తవుతాయని ఎమ్మెల్యేకు వారు తెలియజేశారు. అనంతరం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీగ నిలిచే బారా షహీద్ దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం తన అదృష్ఠంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. 85 లక్షల రూపాయల వ్యయంతో రెండు ముఖ ద్వారాలను నిర్మిస్తున్నామని, దర్గా అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో సహకరిస్తున్నారని పేర్కొన్నారు. జూలై నెలలో జరిగే రొట్టెల పండుగ నాటికి ముఖ ద్వారాల పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ, వక్ఫ్ బోర్డు ఛైర్మైన్ అబ్ధుల్ అజీజ్ సహకారంతో దర్గాను మరింతి అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు.

Read Previous

విద్యతోనే సామాజిక మార్పు సాధ్యం : కోవూరులో అక్షర దీపం కార్యక్రమానికి శ్రీకారం

Read Next

నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా వై.ఓ. నందన్

Leave a Reply

Your email address will not be published.