Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సాగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 303 చోట్ల జరుగుతున్న పనుల పరోగతిని నిత్యం అడిగి తెలుసుకుంటున్నారు. మే నెల 20వ తేదీ లోపు ఖచ్చితంగా పనులు పూర్తి కావాలని సంబంధిత కాంట్రాక్టర్లకు గట్టిగానే చెబుతున్నారు. అంతే కాకుండా పనులు జరుగుతున్న ప్రాంతాలను కోటంరెడ్డి ఆకస్మికంగా సందర్శించి పనుల పురోగతిని స్వయంగా పరిశీలిస్తున్నారు. నాణ్యతను తనిఖీ చేస్తున్నారు. మంగళవారం ఆయన నగరంలోని 19వ డివిజన్ లో జరుగుతున్న పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ 19వ డివిజన్ లో పనులు దాదాపుగా పూర్తయ్యాయని చెప్పారు. ప్రజలే దగ్గరుండి పనులు చేయించుకోవడం సంతోషంగా ఉందని, మే 20వ తేదీ కల్లా అన్నీ పనులు పూర్తవుతాయని వెల్లడించారు. రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగే పనులకు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నాారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
