నెల్లూరు మెడికవర్ లో విజయవంతంగా బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స

Clock Of Nellore ( Nellore ) – బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ మహిళకు నెల్లూరులోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు హాస్పిటల్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ రంగరామన్ వెల్లడించారు. రోగి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కూడా అయ్యారన్నారు. మంగళవారం మెడికవర్ హాస్పిటల్ లో డాక్టర్ రంగరామన్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. జిల్లాకు చెందిన 24 ఏళ్ల మహిళ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ వివిధ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుందని, అయితే క్యాన్సర్ పూర్తిగా నయం కాకపోవడంతో మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కు వచ్చారన్నారు. రోగిని పరీక్షించిన తాము అలోజెనిక్ విధానంలో బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స అందిస్తే పూర్తిగా తగ్గే అవకాశం ఉందని వారి కుటుంబసభ్యులకు తెలిపామన్నారు. వారు నిరుపేదలు కావడంతో పూర్తిగా ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తామని చెప్పామని డాక్టర్ రంగరామన్ తెలియజేశారు. కుటుంబసభ్యులు అంగీకరించడంతో బ్లడ్ క్యాన్సర్ కు అధునాతన పద్దతుల్లో బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స అందించామని, రోగి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కూడా అయ్యారన్నారు.

అదే కోవలో మరో వ్యక్తికి కూడా విజయవంతంగా అలోజెనిక్ బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్సను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. సాధారణంగా నిర్వహించే ఆటోలోగస్ బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స కంటే అలోజెనికి ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స ఎంతో క్లిష్టమైందని, ఖర్చు కూడా అధికమన్నారు. అయితే తాము ఈ క్లిష్టమైన ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్సలను ఉచితంగా ఆరోగ్య శ్రీ ద్వారా చేస్తున్నామన్నారు. బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న రోగులు భయపడవద్దని నెల్లూరులోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేవలం మహా నగరాల్లోనే అందుబాటులో ఉంటే ఈ తరహా చికిత్సలు మెడికవర్ లో అందుబాటులో ఉన్నాయని, 2023 నుండి ఇప్పటి వరకూ నెల్లూరు మెడికవర్ ఇప్పటివరకూ ఐదు మందికి ఆటో లోగస్ బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు.

మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఐసియు వైద్యులు డాక్టర్ గౌతమ్ మాట్లాడుతూ బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడాల్సిన పనిలేదని, నెల్లూరు మెడికవర్ లో అత్యాధునికి వైద్య సదుపాయాలతో ఆ చికిత్స అందుబాటులో ఉందన్నారు. నెల్లూరు జిల్లా ప్రజల అవసరాలను దృష్ఠిలో ఉంచుకుని ఆసుపత్రి ఛైర్మైన్ డాక్టర్ అనీల్ కృష్ణారెడ్డి, డైరెక్టర్ హరికృష్ణ సహకారంతో నెల్లూరులోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో అన్నీ విభాగాలను ఏర్పాటు చేసి వైద్య సేవలను అందిస్తున్నామని చెప్పారు. నిరుపేదలకు ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా చికిత్సలు చేస్తున్నామని, ఈ అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి, పిఆర్వో చందు వర్మ, సిబ్బంది పాల్గొన్నారు.

Read Previous

రోడ్లపై చెత్త వేస్తే జరిమానాలు : హెచ్చరించిన కమిషనర్ సూర్యతేజ

Read Next

ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆకస్మిక తనిఖీలు : పనుల నాణ్యత పరిశీలన

Leave a Reply

Your email address will not be published.