బక్రీదు ఏర్పాట్లపై ఎమ్మెల్యే కోటంరెడ్డి సమీక్ష : 16 కల్లా ఏర్పాట్ల పూర్తికి ఆదేశం

Clock Of Nellore ( Nellore ) – ఈనెల 17వ తేదీ జరిగే బక్రీదు పర్వదినాన ముస్లింలు ప్రార్ధనలు నిర్వహించుకునేందుకు నెల్లూరులోని బారా షహీద్ దర్గాలో నిర్వహించే ఏర్పాట్లపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు, నగరపాలక సంస్థ కమిషనర్ వికాశ్ మర్మత్, డిఆర్వో లవన్న ఇతర అధికారులతో దర్గా ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. బక్రీదు పర్వదినాన్ని జరుపుకునేందుకు నిర్వహించాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ప్రార్ధనలు నిర్వహించుకునేందుకు ఏలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు. ఒక రోజు ముందే అంటే 16వ తేదీ కల్లా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను గతంలో చేపట్టిన 141 రోజుల మహా పాదయాత్ర కార్యక్రమాన్ని బక్రీదు రోజే ప్రారంభించానని గుర్తు చేశారు. బక్రీదు అంటే తనకు సెంటిమెంట్ అని పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా నేరుగా తనను కలవవచ్చునని స్పష్టం చేశారు.

Read Previous

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం – నెల్లూరంతా సంబరం

Read Next

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో వ్యవసాయ అధికారుల భేటీ

Leave a Reply

Your email address will not be published.