Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని బారా షహిద్ దర్గా స్వర్ణాల చెరువు ఘాట్ ను శనివారం నగర మేయర్ స్రవంతి పరిశీలించారు. రెండు రోజుల క్రితం ముస్లిం మత పెద్దలు స్వర్ణాల చెరువులో గుర్రపు డెక్క ఎక్కువగా చేరుకుని అపరిశుభ్రంగా ఉందని, స్వర్ణాల చెరువును పరిశీలించి సమస్యను పరిష్కరించాలని మేయర్ ను కోరగా స్పందించిన మేయర్ స్రవంతి శనివారం చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ముస్లిం మత పెద్దల కోరిక మేరకు బారాషాహీద్ దర్గా స్వర్ణాల చెరువు పరిసర ప్రాంతాల్ని పరిశీలించడం జరిగిందని, గత రెండు రోజులు క్రితం తనను కలిసినప్పుడు బారా షాహిద్ దర్గాలో స్వర్ణాల చెరువులో గుర్రపుడెక్క ఉండడం పరిసర ప్రాంతాల్లో ఎక్కువ చెత్త చేరిందని, ప్రత్యేక శ్రద్ధతో స్వర్ణాల చెరువు ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తామని అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బారా షహీద్ దర్గాకు 15 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించారని, మొదటి నుంచి కూడా ముస్లిం సోదరులు ఏది అడిగినా శక్తివంచన లేకుండా కృషి చేసి సమస్యలను పరిష్కరిస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా త్వరలో బక్రీద్ పండుగ కూడా ఉన్నందున స్వర్ణాల చెరువులో ప్రత్యేక శానిటేషన్ నిర్వహించి, బారాషహీద్ దర్గా పరిసర ప్రాంతాలను శుభ్రపరచాలని అధికారులను మేయర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈద్గా కమిటీ ప్రెసిడెంట్ షకీల్ అహమద్, ఖతీబ్ హజరత్ అబూబకర్, మైనారిటీ నాయకులు షేక్ మస్తాన్, జెడ్పిటిసి కోఆప్షన్ సభ్యులు షేక్ అల్లా బక్షు, రియాజుద్దీన్, గయాజుద్దిన్, జవాదుల్లా, జిలాని, షంషుద్దీన్, రషీద్, రియాజ్, బషీర్, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
