Clock Of Nellore ( Gudur ) – అహ్మదాబాద్ నుండి చెన్నై వెళ్లే నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైల్లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. శుక్రవారం తెల్లవారు జామున రైలు ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని గూడూరు రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే రైల్లోని ప్యాంట్రీ కార్ ( ఆహార పదార్ధాలు తయారు చేసే ప్రత్యేక భోగి )లో మంటలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన రైల్లోని సిబ్బంది గూడూరు రైల్వే స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. రైలును గూడూరు రైల్వే జంక్షన్ లో నిలిపివేశారు. సకాలంలో స్టేషన్ కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మరో వైపు రైల్లో మంటలు చెలరేగాయని తెలుసుకున్న ప్రయాణీకులు ఆందోళనకు గురైనారు. రైలును ఆపగానే అందరూ కిందికి దిగిపోయారు. మంటలు అదుపులోకి రావడంతో అధికారులు రైలు ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గంట తర్వాత రైలు చెన్నైకు బయలు దేరింది.

Tags: AP Top Train Accidents Chennai to Ahmadabad Fire In Navjeevan Express Navjeevan Express Train Fire