ఆరోగ్యమే మహా భాగ్యం : అవగాహన కల్పించిన మెడికవర్ వైద్యులు

  • నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
  • మెడికవర్ లో అవగాహన కార్యక్రమం నిర్వహణ
  • వ్యాయామంతోనే మంచి ఆరోగ్యం లభిస్తుందని వెల్లడి
  • ఏడాదికి ఒక్క సారి ఖచ్చితంగా ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవాలని సూచన
  • మెడికవర్ లో తక్కువ ఫీజులతోనే ఫుల్ బాడీ చెకప్

Clock Of Nellore ( Nellore ) – అన్నింటికంటే ఆరోగ్యమే ముఖ్యమని, ఎవ్వరైనా ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే ఆరోగ్యంగా ఉంటేనే అది సాధ్యపడుతుందని నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ అన్నీ విభాగాల సీనియర్ వైద్యులు పేర్కొన్నారు. సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మెడికవర్ లో వారు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల వైద్యులు ఆరోగ్య అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నేటి ఆధునిక యుగంలో అందుబాటులో ఉన్న ఆధునిక సౌకర్యాలు, సాధనాలు కూడా మనిషి ఆరోగ్యానికి ఆటంకంగా నిలుస్తున్నాయని అన్నారు. సహజ సిద్దమైన జీవన శైలిని అవలంబిస్తే మనిషి ఎలాంటి అనారోగ్యాలకు గురి కాకుండా ఉంటారన్నారు. తెల్లవారు జామున నిద్ర లేవడం, వ్యాయామం చేయడం, రాత్రి పూట త్వరలో నిద్రించడం, ప్రకృతిని ఆశ్వాదిస్తూ పనులు చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారన్నారు. అలాగే సహజ సిద్దంగా పండించే కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలు, స్వచ్చమైన మంచినీటి త్రాగడం లాంటివి త్రాగాలని చెప్పారు. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీలో తయారయ్యే వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. వీటి కారణంగా మనిషిపై ఒత్తిడి పెరుగుతుందని తద్వారా డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం లాంటి రోగాలు వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు తెలియజేశారు. అన్నింటికంటే ప్రధానంగా వ్యాయామం చేయడం ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా చేసుకోవాలని, ఏడాదికి ఒక సారి ఫుల్ హెల్త్ చెకప్ చేయించుకోవాలని సూచించారు. నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో అతి తక్కువ ఫీజులతోనే ఫుల్ బాడీ హెల్త్ చెకప్ చేస్తున్నట్లు ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు పిలుపునిచ్చారు.

 

Read Previous

టిడిపి ప్రభుత్వంతోనే ముస్లింల అభివృద్ధి : ఇఫ్తార్ విందులో నేతల స్పష్టీకరణ

Read Next

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో ప్రపంచ పార్కిన్సన్స్ వ్యాధి దినోత్సవం 2025

Leave a Reply

Your email address will not be published.