
Clock Of Nellore ( New York ) – అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరిన మంత్రి నారా లోకేష్ కు న్యూయార్క్ విమానాశ్రయంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వీడ్కోలు పలికారు. గత నెల 25న మంత్రి లోకేష్ అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఏపిలో విదేశీ సంస్థల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికా వెళ్లిన మంత్రి లోకేష్ దిగ్గజ కంపెనీల అధినేతలతో భేటీ అయిన విషయం తెలిసిందే. అలాగే అమెరికాలోని అట్లాంటలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని కూడా లోకేష్ ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కూడా పాల్గొన్నారు. పర్యటన ముగిసిన నేపద్యంలో ఏపికి బయలుదేరిన మంత్రి లోకేష్ కు న్యూయార్క్ విమానాశ్రయంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ ను లోకేష్ అభినందించారు. తనతో పాటూ పర్యటనలో పాల్గొని, విజయవంతం అయ్యేందుకు సురేష్ కృషి చేశారని కొనియాడారు.