
Clock Of Nellore ( Nellore ) – నిత్యం యోగా చేస్తే ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవని, శారీరకంగానే కాకుండా మానసికంగానూ ప్రశాంతంగా ఉండవచ్చునని నెల్లూరులోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బింధు రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందితో యోగా నిపుణులు ప్రసన్న కుమార్, స్వప్నలు యోగాసనాలు వేయించారు. యోగాలో ఉన్న ఆసనాలు వాటి ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. అలాగే యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హాస్పిటల్ లో ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సెంటర్ హెడ్ డాక్టర్ బింధు రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ యశ్వంత్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ సతీష్, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ బింధు రెడ్డి మాట్లాడుతూ నిత్యం యోగా చేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళన, నిరాశ, భయం, ఇతర ఆరోగ్య రుగ్మతలను విజయవంతంగా జయించవచ్చునని అన్నారు. ఊబకాయం, గుండె జబ్బులు, కాలేయ సమస్యలు కూడా యోగాతో దరిచేరవని వెల్లడించారు. షుగర్ వ్యాధితో బాధ పడే వారు నిత్యం యోగా చేస్తే షుగర్ లెవన్స్ స్థిరంగా ఉంటాయని డాక్టర్ బింధు రెడ్డి తెలియజేశారు.