Clock Of Nellore ( Nellore ) – ఈనెల 4వ తేదీనా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్, ఫలితాల విడుదల నేపద్యంలో ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా ముందు జాగ్రత్తగా అధికారులు వివిధ చర్యలు చేపట్టారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజుల పాటూ 144 సెక్షన్ ను అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ ప్రకటించారు. ఈనెల 3వ తేదీ ఉదయం 6 గంటల నుండి 6వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ ను అమలు చేయనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. 144 సెక్షన్ ప్రకారం ఐదుగురి కంటే ఎక్కువ మంది జనం గుమికూడటం నేరమని వెల్లడించారు. చట్ట విరుద్దంగా సమావేశాలు, బహిరంగ సమావేశాలు కూడా నిర్వహించరాదని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా ప్రజలు సహకరించాలని కలెక్టర్ తో పాటూ జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ విజ్ఞప్తి చేశారు.
Tags: 144 bSection In Nellore 144 Section Impliment By Nellore 2024 AP Assembly Election Result Nellore police