Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా వ్యాప్తంగా 78.10 శాతంగా పోలింగ్ నమోదైంది. పోలింగ్ అనంతరం సోమవారం అర్ధరాత్రి తర్వాత జిల్లా కలెక్టర్ పోలింగ్ శాతాన్ని అధికారికంగా ప్రకటించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 83.39 పోలింగ్ శాతం నమోదు కాగా, నెల్లూరు రూరల్ లో అత్యల్పంగా 66.18 శాతం పోలింగ్ నమోదైంది. కందుకూరులో 82.19, కావలిలో 81.83, ఆత్మకూరులో 82.06, కోవూరులో 78.07, నెల్లూరు సిటీలో 70.20, ఉదయగిరిలో 83.64 శాతంగా పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్ హరినారాయణన్ తెలియజేశారు. జిల్లా మొత్తంగా 78.10 శాతంగా పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు.