ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్ధులు, ప్రముఖులు, అధికారులు…

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధులు, ప్రముఖులు, అధికారులు వారి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ ఓటర్ల మాదిరిగానే పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన వారు క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు. తెలుగుదేశం పార్టీ నెల్లూరు ఎంపి అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, వారి కుటుంబసభ్యులు నెల్లూరు మాగుంట లే అవుట్ లో ఉన్న ఎస్.ఆర్.కే. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైసీపి ఎంపి అభ్యర్ధి విజయసాయిరెడ్డి నెల్లూరు కొండాయపాళెం స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సతీమణి సునందారెడ్డి, కుమార్తె నేహారెడ్డి, తల్లి సుజాతమ్మతో కలిసి ఓటు వేశారు. పోలింగ్ కేంద్రం వద్ద సౌకర్యాలు సరిగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి పొంగూరు నారాయణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రామలింగాపురం నీటి పారుదల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. వైసీపి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఖలీల్ అహ్మద్ జెండావీధిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నెల్లూరు రూరల్ వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సతీమణి, కుమార్తెతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆదాల ఓటు వేశారు. నెల్లూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి మాగుంట లే అవుట్ లోని ఎస్.ఆర్.కే. ఇంగ్లీష్ మీడియం స్కూల్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తన సతీమణితో కలిసి నగరంలోని డికేడబ్ల్యు కళాశాల పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సర్వేపల్లి టిడిపి అభ్యర్ధి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అల్లీపురంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే సర్వేపల్లి వైసీపి అభ్యర్ధి కాకాణి గోవర్ధన్ రెడ్డి తమ కుటుంబసభ్యులతో కలిసి పొదలకూరు మండలం, తోడేరులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆత్మకూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆనం రామ నాారాయణరెడ్డి నెల్లూరులోని సంతపేటలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయగిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి కాకర్ల సురేష్ వింజమూరులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆత్మకూరు, ఉదయగిరి వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధులు మేకపాటి విక్రమ్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి వారి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీళ్లే కాకుండా జిల్లాకు చెందిన రాజకీయ ప్రముఖులు, అధికారులు, అభ్యర్ధులు వారి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Read Previous

నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ …. !

Read Next

నెల్లూరుజిల్లాలో పోలింగ్ శాతం 78.10 : నెల్లూరు రూరల్ లో అత్యల్పం

Leave a Reply

Your email address will not be published.