
Clock Of Nellore ( Kavali ) – మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరుపతిజిల్లా రేణిగుంట ఎద్దల చెరువు వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన విష్ణువర్ధన్ రెడ్డి వైసీపి కండువా కప్పుకున్నారు. బస్సు యాత్రలో ఉన్న సిఎం జగన్… విష్ణువర్ధన్ రెడ్డికి కండువా కప్పి వైసీపిలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత ఆయన్ను ఆలింగనం చేసుకుని పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ… ఆపార్టీకి దూరంగానే ఉంటున్న మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిని ఇటీవల నెల్లూరు వైసీపి ఎంపి అభ్యర్ధి విజయసాయిరెడ్డి కలిశారు. వైసీపిలోకి రావాలని ఆహ్వానించగా ఆయన అంగీకరించారు. వెంటనే టిడిపికి రాజీనామా చేశారు. ఇవాళ విజయసాయి రెడ్డి, కావలి ఎమ్మెల్యే అభ్యర్ధి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, వైసీపి జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సిఎం జగన్ సమక్షంలో వైసీపిలో చేరారు. విష్ణువర్ధన్ రెడ్డి రాకతో కావలిలో వైసీపి బలం రెట్టింపు అయిందని ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.