
Clock Of Nellore ( Nellore ) – దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలను నెల్లూరుజిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని అన్నీ ప్రాంతాల్లో వైఎస్ విగ్రహాలకు వైసీపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, నేతలు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నెల్లూరులోని వైసీపి జిల్లా కార్యాలయంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయనతో పాటూ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీలు మేరిగ మురళి, బల్లి కళ్యాణ చక్రవర్తి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నుడా ఛైర్మైన్ ముక్కాల ద్వారకానాథ్ తదితరులు కూడా ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంభందించి కరెంటాఫీసు సెంటర్ లో ఉన్న వైఎస్ విగ్రహానికి విజయడైరీ ఛైర్మైన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, పలువురు కార్పొరేటర్లు నివాళులు అర్పించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని గాంధీబొమ్మ సెంటర్ లో ఉన్న వైఎస్ విగ్రహానికి డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో పలువులు కార్పొరేటర్లు, నేతలు నివాళులు అర్పించారు.
Reporter – P. Eswar