Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ బింధు మీనన్ ఇండియన్ ఎపిలెప్సీ అసోసియేషన్ ( Indian Epilepsy Association (IEA) ) కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈనెల 23వ తేదీనా జైపూర్ లో జరిగిన ఎపిలెప్సీ ECON జాతీయ సదస్సులో భాగంగా ఆమెను జాతీయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బింధు మీనన్ మాట్లాడుతూ తన పరిశోధన, విద్య, చికిత్స, ఔట్ రీచ్ కేర్ లో భాగంగా మూర్చ వ్యాధి గ్రస్తుల అభ్యున్నతికి ఎంతో కాలం నుండి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇండియన్ ఎపిలెప్సీ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి పదవి ఎంతో బాధ్యతాయుతమైనదని పేర్కొన్నారు. అసోసియేషన్ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తూ మూర్చ వ్యాధికి సంబంధించిన పరిశోధనలు కొనసాగిస్తానని వెల్లడించారు. తనను ఎన్నుకున్న సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.
Tags: BIRTH OF INDIAN EPILEPSY ASSOCIATION Dr Bindhu Meenon Dr Bindu Menon Foundation Nellore Indian Epilepsy Association (IEA) Nellore Famous Doctor Dr Bindu Menon