- నేడు పార్కిన్సన్స్ దినోత్సవం
- ఎక్కువగా 60ఏళ్లు పైబడిన వారిలో పార్కిన్సన్స్ వ్యాధి
- ఈ వ్యాధికి పూర్తి స్థాయిలో నివారణలేదు
- చేతలు వణకడం, నడక స్పీడు తగ్గడం, మాటతడబాటు ఈ వ్యాధిలక్షణాలు
- పార్కిన్సన్స్ వ్యాధి గురించి ఆసక్తిక అంశాలు వెల్లడించిన అపోలో డాక్టర్ బిందుమీనన్
Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్‌లో మంగళవారం పార్కిన్సన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. పార్కిన్సన్స్ వ్యాధి అనేది మెదడుకు సంబంధించిన వ్యాధి అని తెలిపారు. చేతులు వణుకు, నడక మారడం, మాట తడబటం వంటి ఈ వ్యాధి లక్షణాలని పేర్కొన్నారు. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరి సంక్రమించదని, 60ఏళ్లు పైబడిన వారిలో ఈ పార్కిన్సన్స్ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుందని వివరించారు. ఎలాంటి కారణాలు లేకుండానే ఈవ్యాధి వస్తుందని, ఈ పార్కిన్సన్స్ ఎందుకు వస్తుందనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. జన్యుపరంగా ఇది కేవలం 5శాతం వరకు మాత్రమే సంక్రమిస్తుందని చెప్పారు. మెదడులో డోపమైన్ ఉత్పత్తి లేకపోవడం ఈ వ్యాధి వస్తుందని, ఈ వ్యాధి లక్షణాలు గుర్తించిన తరువాత న్యూరాలజిస్ట్‌ను సంప్రదిస్తే వారు పరీక్షించి, ఇది పార్కిన్సన్స్ కాదా అని నిర్ధారిస్తారని, అదేవిధంగా మెదడుకు స్కాన్ తీసి ఇతర సబంధిత రుగ్మతలు ఏమైనా ఉన్నాయాఅని క్షుణంగా పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. పార్కిన్సన్స్ ప్రాణాంతకం కాదని, దీనికి మంచి చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ బిందుమీనన్ స్పష్టం చేశారు. ఈ వ్యాధిని త్వరగా గుర్తించగలిగితే చికిత్స విధానం సులువవుతుందని చెప్పారు. పార్కిన్సన్స్ వ్యాధిని నియంత్రణ చేయవచ్చని, అయితే పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదని వెల్లడించారు. డాక్టర్ సూచించిన మందులతో పాటూ ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, యోగా, కౌన్సెలింగ్, కాగ్నిటివ్ రిహాబిలిటేషన్ మరియు డ్యాన్స్ థెరపీ వంటివి పార్కిన్సన్స్ వ్యాధి నియంత్రణకు ఉత్తమ చికిత్సలుగా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కావున ఈ పార్కిన్సన్స్ వ్యాధి పట్ల అప్రమత్తత అవసరమని, ముఖ్యంగా 60ఏళ్లు పైబడిన వారు ఈ లక్షణాలు ఉంటే న్యూరాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిదని సూచించారు. సమాజంలో ఈ వ్యాధిపట్ల ఉన్న ప్రచారాలు అపోహలని స్పష్టం చేశారు.