Clock Of Nellore ( Venkatagiri ) – క్రాస్ ఓటింగ్ ఆరోపణలతో వైసీపి నుండి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యేలు ఆనం రామ రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి లపై తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైసీపి నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. వారి నలుగురి కటౌట్లను కైవల్యా నదిలో నిమజ్జనం చేసి పిండ ప్రదానం చేశారు. స్థానిక వైసీపి నేత కలిమిలి రాం ప్రసాద్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మైన్ దొంత శారద ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీకి ద్రోహం చేసి ప్రతిపక్ష పార్టీకి అమ్ముడుపోయిన ఆ నలుగురు ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తారని అన్నారు.