
Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో ఈనెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకూ మూడు రోజుల పాటూ జర్నలిస్టులకు క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు నెల్లూరు అర్భన్ డెవలప్ మెంట్ అథారిటి ( నుడా ) ఛైర్మైన్ ముక్కాల ద్వారకానాథ్ తెలిపారు. జర్నలిస్ట్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( జేశాప్ ) ఆధ్వర్యంలో జరిగే ఈ క్రికెట్ పోటీల్లో జిల్లాలోని జర్నలిస్టులందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. శుక్రవారం ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన విలేకరుల సమావేశంలో ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడారు. నిత్యం వార్తల సేకరణలో బిజీగా ఉండే జర్నలిస్టులు ఈ పోటీల్లో పాల్గొని పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందాలని సూచించారు. మొత్తం 12 టీంలు పోటీల్లో పాల్గొననున్నాయని, మూడు విభాగాల్లో బహుమతులు అందజేయనున్నామని చెప్పారు. మాజీ రంజీ క్రికెటర్ మలిరెడ్డి కోటారెడ్డి మాట్లాడుతూ ఈ పోటీల ద్వారా క్రీడా స్పూర్తిని అలవర్చుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో జర్నలిస్ట్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కిషోర్, ప్రధాన కార్యదర్శి సునీల్, కార్యదర్శులు నరేష్, మౌంట్ బాటన్, సెట్నల్ సిఈఓ పుల్లయ్య, చెస్ అసోసియేషన్ కార్యదర్శి సుమన్ తదితరులు పాల్గొన్నారు.