Clock Of Nellore ( Nellore ) – ఈనెల 7వ తేదీనా జరిగే జయహో బిసి మహాసభకు ప్రతీ ఒక్కరూ హాజరయ్యి సభను జయప్రదం చేయాలని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం ఆయన నెల్లూరు 5వ డివిజన్ లోని అహ్మద్ నగర్ లో పర్యటించారు. గడప గడపకూ వెళ్లి ప్రజలను పలకరించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను కొందరు ఎమ్మెల్యే దృష్ఠికి తీసుకురాగా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈనెల 7వ తేదీ జరిగే బీసీ మహాసభను ప్రజలంతా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, స్థానిక కార్పొరేటర్ ఓబిలి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.