ఫ్లై ఓవర్ పనులు, కార్తీక దీపోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన మాజీ మంత్రి అనీల్

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని రామలింగాపురం వద్ద మినీ బైపాల్ లో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ వంతెన పనులను నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ గురువారం పరిశీలించారు. వంతెనపై జరుగుతున్న స్లాబ్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. వంతెన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం నగరంలోని విఆర్సీ మైదానంలో శుక్రవారం నుండి మూడు రోజుల పాటూ జరగనున్న కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను కమిటి సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు కర్తం ప్రతాప్ రెడ్డి, నేతలు గణేశం వెంకటేశ్వర్లు రెడ్డి, నేతాజి సుబ్బారెడ్డి, వావిలేటి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

Read Previous

విద్యార్ధి కన్నుపై కొట్టిన టీచర్ : నెల్లూరులో రవీంద్ర భారతి స్కూల్ నిర్వాకం

Read Next

విద్యార్ధులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన నెల్లూరు జడ్ఫీ ఛైర్ పర్సన్ ఆనం

Leave a Reply

Your email address will not be published.