Clock Of Nellore ( Nellore ) – స్కోయ్ టోర్నమెంట్ లో పతకాలు సాధించిన క్రీడాకారులను, స్కోయ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా ( Sqay Federation Of India ) జాయింట్ సెక్రటరీగా నియమితులైన యస్.ఇస్మాయిల్ ను నెల్లూరు మేయర్ స్రవంతి సోమవారం అభినందించారు. ఈ నెల 17వ తేదీ నుండి 22 వరకు జమ్ము – కాశ్మీర్ లోని పెహల్ గాం స్పోర్ట్స్ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ స్కోయ్ టోర్నమెంట్, ట్రైనింగ్ క్యాంప్ లో ( Sqay Tournament ) ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ ఇబ్రహీం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు యస్.ఖాదర్ బాషా రెండు బంగారు పతకాలను, యస్.కే.ఫాహీమ్ ఒక బంగారు పతకం, ఒక వెండి పతకం, యస్ మన్సూర్ బాషా వెండి పతకం, ఉమర్ ఫారూక్ కాంస్య పతకాలను సాధించారు. స్కోయ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఎలక్షన్ లో స్కోయ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీగా యస్.ఇస్మాయిల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన క్రీడాకారులను మేయర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్కోయ్ ప్రతినిధులు ఇబ్రహీం, ఇస్మాయిల్, క్రీడాకారులు ఖాదర్ బాషా, ఫాహీం, మన్సూర్ బాషా, ఉమర్ ఫారూక్ తదితరులు పాల్గొన్నారు.
One Comment
Amazing! This blog looks exactly like my old one! It’s on a entirely different subject but it has pretty much the same page layout and design. Great choice of colors!